డయాబెటిస్ ఉన్నప్పుడు పలు రకాల హెల్తీ డ్రింక్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యతో పోరాడుతున్న వారు కొన్ని మసాలా దినుసుల సహాయంతో మధుమేహ నియంత్రణ కోసం పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. మధుమేహం వంటి వ్యాధిని ఇంటి నివారణల సహాయంతో ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.మన వంటగదిలో ఉండే మసాలాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. ఆహారపు రుచిని పెంచే కొత్తిమీర.. ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. కొత్తిమీర, ధనియాలు మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలను దూరం చేస్తుంది. కొత్తిమీర నీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.కొత్తిమీర, లేదా దనియాలను నీటిలో నానబెట్టి ఉంచండి. కొత్తిమీర నీటిని రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం వడకట్టి.. ఆ నీటిని తాగాలి. కొత్తిమీరలో ఉండే గుణాలు రాత్రిపూట నీటిలో కలిసిపోయి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.కొత్తిమీర, దనియాలలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


కొత్తిమీర గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సైతం ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు కొత్తిమీరను ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. కొత్తిమీర ఇన్సులిన్‌ను నియంత్రించడానికి పని చేస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అందుకే ఈ నీరు మధుమేహం బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.కొత్తిమీరలో ఉండే విటమిన్ సి జుట్టుకు మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది.ఈ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులు దూరంగా ఉంటాయి.దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కొత్తిమీర నీరు చర్మానికి మేలు చేస్తుంది. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: