ఫ్యాటీ లివర్ జబ్బుకి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే, మధుమేహం, గుండెపోటు ఇంకా స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే , మీరు ఈ వ్యాధి నుంచి బయటపడే కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకోవాలి..కొవ్వు కాలేయ సమస్యను తగ్గించుకోవాలంటే ముందుగా మీరు దాని ప్రమాద కారకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఊబకాయం, స్లీప్ అప్నియా, అధిక ట్రైగ్లిజరైడ్స్, హైపోథైరాయిడిజం ఇంకా అలాగే మధుమేహం కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని చాలా చాలా ఈజీగా పెంచుతాయి. కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంది.కొవ్వు కాలేయ సమస్యను తగ్గించుకోవడానికి  మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఇంకా రోజువారీ వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చెయ్యడం చాలా ముఖ్యం. దీనితో పాటు, కొవ్వు కాలేయం ప్రమాదాల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.


అందువల్ల ఈ సమస్యకి మెరుగైన చికిత్సని కనుగొనవచ్చు. బరువు తగ్గడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, మంట ఇంకా ఫైబ్రోసిస్ తగ్గుతాయి.మొక్కల ఆధారిత ఆహారంని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ డైట్ ఫాలో అయితే పండ్లు, కూరగాయలపై కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ఇంకా గింజలు  ఉంటాయి.కాబట్టి వీటిని ఖచ్చితంగా తినండి.ఇంకా అలాగే ప్రతి వారం కూడా ఖచ్చితంగా 150 నిమిషాల ఇంటెన్స్ ఏరోబిక్స్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చని ఒక అధ్యయనంలో కనుగొన్నారు. ఈ అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురించడం జరిగింది.ఇంకా అలాగే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజూ వ్యాయామం చేయడం ఇంకా రోజుకి ఒక పూట ఉపవాసం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఓ అధ్యయనంలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: