తిన్న తరువాత కడుపు నొప్పి వస్తే ఇలా చెయ్యండి?

కొంతమందికి తిన్న తరువాత కడుపులో తిమ్మిరి, వికారం, వాంతులు వచ్చినట్లు అవుతుంది. అయితే చాలా వరకు బయట ఆహారం తిన్న తరువాత ఇలాంటి పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది.ఫుడ్ పాయిజన్ వల్ల ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నా లేదా నిల్వ ఉంచిన ఆహారం తిన్నా ఇలాంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య కూడా పెరగుతుుంది. ఎసిడిటీ సమస్య ఉంటే కూడా ఇలాగే తిమ్మిర్లు, వాంతి ఇంకా కడుపులో నొప్పి వస్తుంది.ఫుడ్ పాయిజనింగ్ అనేది సాధారణంగా వికారం, వాంతులు, కడుపు నొప్పి, లూజ్ మోషన్‌తో మొదలవుతుంది. నిల్వ ఉంచిన ఆహారం ఇంకా పాడైపోయిన ఆహారం తిన్న కొద్ది గంటల్లోనే కడుపు నొప్పి మొదలవుతుంది. ఇంకా అలాగే వైరస్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఈ సమయంలో లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అధిక వాంతులు, కడుపు నొప్పి ఇంకా డీహైడ్రేషన్ వల్ల వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడం, ఆకలి లేకపోవడం ఇంకా మత్తుగా ఉండటం జరుగుతుంది.


డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడేందుకు జ్యూస్‌లు, నీరు, ఓరల్ రీహైడ్రేషన్ తీసుకోవాలి.ఇంకా సొల్యూషన్స్(ఓఆర్ఎస్) వంటివి ఎక్కువగా తీసుకోవాలి.ఇంకా అలాగే అవసరమైనంత విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ అలసిపోకుండా ఉండాలి.అలాగే మసాలా, ఆయిల్ ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి.పెరుగు, అన్నం, కిచిడీ, కూరకు బదులుగా టోస్ట్, అరటిపండ్లు తినడం మంచిది.ఇంకా అలాగే తీవ్రమైన కడుపునొప్పి, అతిసారం ఆగకపోతే ఖచ్చితంగా వైద్యుల సలహా మేరకు మెడిసిన్స్ వాడాలి.ఇంకా అలాగే అధిక విరేచనాల నివారణకు యాంటీబయాటిక్ మెడిసిన్స్ కూడా వాడొచ్చు.కాబట్టి తిన్న తరువాత కడుపు నొప్పి వస్తే ఇలా చెయ్యండి..ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ వాడండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: