అధిక బరువు తగ్గేందుకు ఉపయోగపడే కొన్ని పానీయాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.గోరు వెచ్చటి నీటిని తీసుకొని అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, తేనె వేసుకుని కలుపుకోవాలి. దాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల ఖచ్చితంగా జీవ క్రియ మెరుగుపడుతుంది.దాని ఫలితంగా శరీరంలో కేలరీలు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా ఈజీగా నియంత్రిస్తుంది. తేనె అనేది సహజమైన తీపి పదార్థం. ఇది జీవ క్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.గ్రీన్‌టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.  ఈ గ్రీన్‌ టీలో కాస్త నిమ్మరసం, అల్లం తురుము వేసుకొని తాగొచ్చు. లేదంటే ఈ టీలో ఓ చెక్క నిమ్మకాయను కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలను మరింత పెంచుతుంది.అందువల్ల శరీరం డిటాక్సిఫికేషన్‌ జరుగుతుంది.


అల్లం జీర్ణ క్రియను పెంచి బరువు నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా సోంపు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండకుండా కూడా చేస్తుంది. అందుకే ఇవి బరువును తగ్గించడంలోనే చక్కగా సహకరిస్తాయి. సోంపు గింజల్ని ఓ గ్లాసుడు నీటిలో వేసి సగానికి మరగనివ్వాలి. గోరు వెచ్చగా వాటిని ప్రతి రోజూ తాగుతూ ఉండటం వల్ల జీర్ణ క్రియ బాగా మెరుగవుతుంది. ఇంకా పొట్ట ఉబ్బరం లాంటివి కూడా తగ్గుతాయి. దాని జీవ క్రియ వేగవంతం అయి బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.గోరు వెచ్చని నీరు తీసుకొని అందులో తాజాగా తురిమిన అల్లాన్ని వేయాలి. అలాగే అందులో కాస్త నిమ్మ రసం కలిపి తాగాలి.ఇక దీన్ని ఫ్యాట్‌ బర్నింగ్‌ డ్రింక్‌ అని చెప్పవచ్చు. ఇది జీవ క్రియను చాలా వేగవంతం చేస్తుంది.ఇంకా అలాగే నిమ్మకాయ వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. పొద్దున్నే పరగడుపున దీన్ని రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నిమ్మకాయ  కొంత మందికి పడదు. అలాంటి వారు నిమ్మకాయను పిండుకోకుండా అచ్చంగా అల్లం నీటినే తాగేందుకు ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: