బ్యూటీ పార్లర్ లో ఉపయోగించే ప్రోడక్ట్లలో ఎంతో కొంత రసాయనాలు ఉంటాయి. అవి చర్మంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి . అదే న్యాచురల్ గా లభించే టమాటోతో చర్మం కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకోవచ్చు . టమాటాలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి చర్మాన్ని వృదువుగా మరియు తెల్లగా మార్చడానికి సహాయపడతాయి . ఖరీదైన బ్యూటీ పార్లర్ కంటే టమాటా తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు . 

మీ బుగ్గలు టమాటా లాగా ఎర్రగా మరియు గులాబీ రంగులోకి మారాలనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ తప్పనిసరిగా ట్రై చేయండి . మీరు దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు . టమాటాను ఎన్నో ఏళ్లుగా చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తూ ఉంటున్నారు . ఇక ఇందులో యాంటీ ఎంజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మరియు శుభ్రంగా చేసేందుకు దాహం పడతాయి . ఇప్పుడు టమాటా ప్యాక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం .

మొదటిగా ఒక టమాటో , ఒక స్పూన్ తేనె , చిటికెడు పసుపు , ఒక స్పూన్ నిమ్మరసం . ముందుగా తాజా టమాటాను బాగా కడిగి తొక్క తీయండి . ఇప్పుడు దాన్ని గుజ్జును వేరు చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి . అనంతరం అందులో ఒక స్పూన్ తేనె మరియు చిటికెడు పసుపు కలపండి . తేనె చర్మానికి తేమను మరియు మెరుపును పిస్తుంది . అలానే పసుపు సహజ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పని చేస్తుంది . ఒకవేళ కనుక మీ చర్మం ఒత్తిడిగా ఉంటే నిమ్మరసం కూడా కలుపుకోండి . ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నుదుటిపై మరియు బుగ్గలపై బాగా అప్లై చేయండి . కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి . ఇలా 20 నుంచి 30 నిమిషాల ఉంచుకుని అనంతరం గోరువెచ్చని నీటితో కడుక్కుంటే అందమైన మరియు మృదువైన చర్మం మీ సొంతం .

మరింత సమాచారం తెలుసుకోండి: