
హామ్, సలామీ, బేకన్ వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫుడ్స్ అయితే కావని ఖఛ్చితంగా చెప్పవచ్చు. ఊరగాయలు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఈ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది. బటర్, చీజ్, కొవ్వు అధికంగా ఉండే మాంసం, కొబ్బరి నూనె, పామాయిల్ వంటి వాటిని ఈ సమస్యలు ఉన్నవాళ్లు పరిమితంగా తీసుకోవాలి. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, బేకరీ ఉత్పత్తులు ఆరోగ్యానికి హాని చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
చిప్స్, పచ్చళ్ళు, ప్రాసెస్ చేసిన ఆహారాలతో పాటు స్వీట్లు, శీతల పానీయాలు, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవాలి. రెడీ-టు-ఈట్ మీల్స్, ఫాస్ట్ ఫుడ్ లాంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు లాంటి వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.