
ఓపికగా మాట్లాడడం, వినడం ముఖ్యమని అర్థమయ్యేలా చేయండి. వారిలో లీడర్‌షిప్, బంధాలను నిర్మించుకునే సామర్థ్యం పెరుగుతుంది. రోజూ బ్రష్ చేయడం, చేతులు కడుక్కోవడం, స్నానం చేసుకోవడం అలవాటుగా చేయండి. కరోనా తర్వాత ఈ హ్యాబిట్‌ల ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ అయింది. తిన్న తర్వాత ప్లేట్ కడగడం, చేతులు తుడుచుకోవడం వంటి చిన్న విషయాలు కూడా కీలకం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మొదటి అడుగు. చిన్న చిన్న సమస్యలను వారు స్వయంగా ఎలా పరిష్కరించాలో నైపుణ్యంగా నేర్పండి. ఉదాహరణకు బొమ్మ కూలిపోతే నెమ్మదిగా మళ్లీ ఎలా కట్టాలో చూపించండి. భవిష్యత్తులో చురుకైన ఆలోచనదారులుగా ఎదుగుతారు.
కథలు వినడం, పదాలు గుర్తించడం, మాటల అర్థం అర్థం చేసుకోవడం. వారికే చిన్న పనులు అప్పగించండి. వాటర్ బాటిల్ నింపడం, స్కూల్ బ్యాగ్ సర్దడం. పనులు పూర్తి చేసినప్పుడు "బాగా చేశావ్" అనే అభినందన చాలా అవసరం. ఇతరులతో ఎలా మెలగాలి, ఎలా సహాయపడాలి, ఎలా హెల్ప్ అడగాలి అనే విషయాల్లో శిక్షణ ఇవ్వండి. పరస్పరం పంచుకోవడం, గౌరవం ఇవ్వడం అలవాటు చేయండి. సహృదయత, మానవీయ సంబంధాల అభివృద్ధి. పొట్ట నొప్పి వస్తే అమ్మకి చెప్పడం, గ్యాస్ దగ్గరకి వెళ్లకూడదని చెప్పడం. రోడ్డు దాటి వెళ్లే ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్పండి. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల నంబర్ గుర్తుంచుకోవడం వంటివి.