శ్రావణమాసం వచ్చేసింది . ఇక ఇళ్లలోని ఆడవాళ్లు అందరూ లక్ష్మీదేవిని స్పెషల్గా పూజిస్తూ ఉంటారు అంతేకాదు శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం ముత్తైదువులకు బొట్టుపెట్టి తాంబూలం ఇస్తే తమ పసుపు కుంకాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి అనేది వారి నమ్మకం . శ్రావణమాసంలో తాంబూలం ఇచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయనే చేయకూడదు అంటున్నారు పండితులు . ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా పవిత్రమైన మాసం . మరియు చేసే ప్రతి పని కూడా పవిత్రంగా ఉండాలి . కొంతమంది తాంబూలం ఇచ్చేటప్పుడు తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు.  అలాంటి తప్పులు కారణంగా వాళ్ళకి పుణ్యం రాకపోగా మహా పాపం మూటకట్టుకుంటారు అంటున్నారు పండితులు . తాంబూలం ఇచ్చేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


* తాంబూలంలో అవసరమైన వస్తువులు లేకపోవడం కూడా మహా పాపం. తాంబూలంలో ఖచ్చితంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, తమలపాకులు, వక్క తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా వాయనం అసంపూర్ణంగా భావించబడుతుంది అంటున్నారు పండితులు.

* తాంబూలం ఇచ్చేటప్పుడు కొత్తవి, తాజావి మాత్రమే ఇవ్వాలి. మరీ ముఖ్యంగా శుభ్రమైనవి ఇవ్వాలి. కొంత మంది పాతవి, వాడిపోయినవి లేదా పాడైపోయిన..ఆల్ రెడీ మనకు ఎవ్వరైన తాంబూలం లో పెట్టి ఇచ్చిన వక్కలు పసుపు , కుంకుమ లాంటివి ఇస్తూ ఉంటారు. అది మహా పపం.
*తాంబూలం ఇచ్చేటప్పుడు  అగౌరవం చూపడం.. ముత్తైదువులకు లేదా కొత్తగా పెళ్లైన ఆడపడుచులకు వాయనం ఇచ్చేటప్పుడు చాలా ప్రేమగా.. ఆప్యాయంగా, గౌరవంగా ఇవ్వాలి.
*వాయనం ఇచ్చే విషయంలో సమయం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇవ్వకూడదు.
* తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులను, వక్కను సరిగ్గా మడిచి, ఇవ్వాలి.
* తాంబూలంలో పిండి వంటలు సరిగ్గా లేకపోవడం..ఎంగిలి చేసిన వంటలు పెట్టదం లాంటివి చేయకూడదు.
* వాయనం ఇచ్చేటప్పుడు శుభ్రత పాటించాలి. వాయనం ఇచ్చే చేతులు శుభ్రంగా ఉండాలి.
ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రావణ మాసంలో ఇచ్చే వాయనం ద్వారా ఆ లక్ష్మీదేవి పూర్తి సంప్తృప్తిరాలై ఆమె అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: