పిల్లల జ్ఞాపక శక్తినిపెంచడానికి సరైన ఆహారం చాలా ముఖ్యమైనది. మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ సరిపడా లభించాలి. ముఖ్యంగా పిల్లలు అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటంతో, మంచి ఆహారం వల్ల వారి బుద్ధి, ఏకాగ్రత, సృజనాత్మకత, మరియు మెమరీ పవర్‌ అన్నీ మెరుగుపడతాయి. కారంలో మెదడులా ఉండే ఈ డ్రైఫ్రూట్, మెదడు ఆరోగ్యానికి అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెమరీ మెరుగుపరిచి, బ్రెయిన్ సెల్స్ పనితీరును పెంచుతాయి. రోజుకు 1–2 వాల్నట్ తినిపించవచ్చు.

బాదంలో విటమిన్ E ఎక్కువగా ఉండటం వల్ల మెదడు తేలికగా పని చేస్తుంది. రోజూ ఉదయాన్నే 5–6 నానబెట్టిన బాదం తినిపిస్తే మెమరీ బలపడుతుంది. గుడ్లలో ఉండే చోలిన్ అనే పోషకం మెదడు అభివృద్ధికి అవసరం. ఇది నర్వ్ ఫంక్షన్‌ను మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడును ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుండి రక్షిస్తాయి. జ్ఞాపకశక్తి, లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి. పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ మెదడు-ఆంత్రమ్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది.

తోటకూర, పాలకూర, కూర వంటి ఆకుకూరల్లో విటమిన్ K, ఫోలేట్, లూటిన్ ఉండి ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెమరీ, లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించి, మెదడుకు ఎలాంటి గ్లూకోజ్ అవసరం ఉందో అలా సమపాళ్లలో అందిస్తుంది. పిల్లల కోసం ఓట్స్ పోరిడ్జ్ లేదా ఓట్స్ డోసా చేస్తే మంచి. జొన్న, సజ్జ, కొర్ర వంటి మిలెట్స్‌లో మాగ్నీషియం, ఐరన్, B-విటమిన్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని కలిగించే న్యూట్రిషన్‌ను అందిస్తాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరఫేన్ మెదడు తేజస్సును పెంచుతుంది. క్యారెట్లో ఉండే బీటా కరోటిన్ మెమరీ శక్తిని మెరుగుపరుస్తుంది. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి చాలా మేలు. చిన్నపిల్లలకు పాలు లేదా స్మూతీ లో కలిపి ఇవ్వవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: