
థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి రాగి చాలా అవసరం. రాగి లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి రాగి నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. రాగిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపును, నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి కూడా రాగి అవసరం. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. గాయాలు త్వరగా మానడానికి కూడా రాగి సహాయపడుతుంది.
దీనివల్ల క్యాన్సర్‌తో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, కణాలను దెబ్బతినకుండా రాగి కాపాడుతుంది. అయితే, రాగి పాత్రలో నీళ్లు తాగేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రాగి పాత్రను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. పాత్ర లోపల నల్లగా మారితే నిమ్మకాయ, ఉప్పు కలిపి రుద్దాలి. రాగిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు వికారం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి