
గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో డవలప్‌మెంట్ మామూలుగా లేదు. సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు.. పేరున్న ప్రముఖులు.. సాప్ట్‌వేర్ ఉద్యోగులు వీకెండ్ వస్తే చాలు శారీరక వ్యాయామం కోసం కొత్తదారులు.. కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు కాస్త దగ్గర్లో పొలాలను చాలా మంది క్రికెట్ గ్రౌండ్లు గా మార్చేసి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. పై ఫోటో లో క్రికెట్ మైదానం చూడండి. ఇది ఒకప్పుడు సాగు భూమి. పంట పొలాలతో పచ్చని కోక కట్టినట్లు కనిపించిన ఈ భూములన్నీ ఇప్పుడు మైదానాలుగా మారిపోతున్నాయి. నగర శివారుల్లో కొందరు యజమానులు పొలాలను క్రికెట్ మైదానాలుగా మార్చి లీజుకు ఇస్తున్నారు.
20 లేదా 25 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు సాధారణ రోజుల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.2 వేల వరకు, ఫ్లడ్‌లైట్ల మధ్య ఆడాలంటే మ్యాచ్‌కు రూ. 6 వేల వరకు చెల్లించాలి. శని, ఆదివారాల్లో రూ.8 వేల వరకు ఉంటుంది. బౌరంపేటలోని ఓ రైతు తన పొలాన్ని ఇలా మైదానంగా మార్చేశారు. ఇప్పుడు చాలా మంది క్రికెట్ మ్యాచ్‌లు బెట్ వేసుకుని కూడా ఇక్కడ అద్దె ఇచ్చి మరీ మ్యాచ్ లు ఆడుతున్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ఇదో ట్రెండ్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు