
*వాస్తు శాస్త్రం ప్రకారం ..తులసి చెట్టు సమీపంలో పొరపాటున కూడా శివలింగం ఉంచకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. మహావిష్ణువుకు తులసి ఎంతో ప్రీతికరమైనది. పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట. అయితే, జలంధరుడిని పరమ శివుడు సంహరించాడట. ఈ కారణంగా పరమ శివుడిని తులసితో పూజించరని వేద పండితులు చెబుతున్నారు.
*అలాగే ఎట్టి పరిస్థితిలోనూ తులసి చెట్టు వద్ద గణేశుడి విగ్రహం ఉంచకూడదని చెబుతున్నారు. పురాణ కథ ప్రకారం గణేశుడు నది ఒడ్డున తపస్సు చేస్తూ ఉండగా, తులసి దేవి నదిలో నుంచి బయటకు వచ్చి గణేశుడిని పెళ్లి ప్రతిపాదన చేస్తుంది. అయితే గణేశుడు ఆమెను నిరాకరిస్తాడు. ఆగ్రహించిన తులసి, "నువ్వు రెండు వివాహాలు చేసుకుంటావు" అని గణేశుడిని శపిస్తుందని చెబుతారు. ఆ కారణంగానే తులసి చెట్టు వద్ద గణేశుడి విగ్రహం ఉంచకూడదని పెద్దలు చెబుతున్నారు.
*వాస్తు శాస్త్రం ప్రకారం తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు, మైలుబట్టలు అస్సలు ఉండకూడదు. అది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి చేస్తుందని నమ్మకం.
*కొంతమంది తులసి చెట్టు వద్ద పేపర్లు, రకరకాల వస్తువులు వేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు.
*మత గ్రంథాల ప్రకారం తులసి మొక్క దగ్గర పొరపాటున కూడా చీపుర , చాట వుంచకూడదు. అలా పెడితే ఇంట్లో అనుకోని సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: పై సమాచారం ప్రజల ఆచారాలు, మత విశ్వాసాలు, వేద పండితుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత నిర్ణయం. దీనిని ఇండియా హెరల్డ్ ధృవీకరించలేదు.