మంచు మనోజ్ ..ఈ పేరు గత కొన్నేళ్లుగా పెద్దగా వినిపించకపోయినా, ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఆయన కెరీర్‌కి ఎలాంటి పెద్ద హైప్ లేకపోయినా, తాజాగా ఆయన నటించిన "మిరాయి" సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించడం తో పరిస్థితి తారుమారైపోయింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మంచు మనోజ్ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా నుండి సినీ వర్గాల వరకు ఒకటే హడావిడి – “మంచు మనోజ్.. మంచు మనోజ్..” అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, ప్రముఖ డైరెక్టర్లు, సినీ క్రిటిక్స్ అందరూ మనోజ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. “మనోజ్‌లో ఇంత వైల్డ్ యాంగిల్ ఉందా? నెగిటివ్ షేడ్స్‌లో ఇంత బాగా పర్ఫార్మ్ చేయగలడా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు.


"మిరాయి" సినిమాలో తేజ సజ్జాకు విలన్‌గా ఎదురుగా నిలిచిన పాత్రలో మంచు మనోజ్ తన అసలైన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటివరకు ఆయన నుంచి ఎప్పుడూ చూడని ఒక కొత్త డైమెన్షన్ ఈ సినిమాలో బయటపడింది. ఒకవైపు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడం, మరోవైపు యాక్టింగ్ స్కిల్స్‌తో ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద స్టార్స్‌ని కూడా మెప్పించడం – ఇవన్నీ కలిసి ఆయన ఇమేజ్‌ని పూర్తిగా రీబిల్డ్ చేశాయి. ఈ సక్సెస్‌తో మనోజ్‌కు ఆఫర్లు వరదలా వస్తున్నాయి. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రిపోర్ట్స్ ప్రకారం.. “మిరాయి” రిలీజ్ అయిన తర్వాత దాదాపు 11 సినిమాల్లో నటించే అవకాశాలు ఆయనకు లభించాయని చెప్పుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఒక బిగ్ పాన్ ఇండియా స్టార్ సినిమా విలన్ ఛాన్స్ కూడా ఆయన సొంతం చేసుకున్నారని టాక్ బాగా వైరల్ అవుతోంది.



అది మరెవరో కాదు, రామ్ చరణ్సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చే కొత్త సినిమా. "రంగస్థలం" తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సుకుమార్ ఒక స్పెషల్ విలన్ పాత్రను డిజైన్ చేశాడట. హీరో పక్కనే ఉంటూ, చివరికి వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్‌గా ఈ రోల్ ఉండబోతుందని సమాచారం. ఈ పాత్ర కోసం చాలామంది స్టార్ యాక్టర్స్‌ని అప్రోచ్ చేసినా, నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవ్వరూ ఒప్పుకోలేదట. కానీ, తాజాగా “మిరాయి” సినిమా చూసిన తర్వాత సుకుమార్, మూవీ మేకర్స్ అందరూ “ఈ రోల్‌కి మంచు మనోజ్ అయితే సరిగ్గా సూట్ అవుతాడు” అని ఫిక్స్ అయ్యారట. ఆయనతో ఫోన్‌లో సంప్రదించి, డిస్కషన్స్ జరిపి, దాదాపు ఫైనల్ చేసేశారని టాక్ వస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.


మంచు మనోజ్ ఇంత పెద్ద పాన్ ఇండియా  సినిమాలో  విలన్ రోల్ దక్కించుకోవడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. “మనోజ్ ఇలాగే వరుసగా విలన్ షేడ్స్‌లో నటిస్తే ఇక ఆయనకు ఇండస్ట్రీలో తిరుగు ఉండదు, కొత్త స్థాయి సక్సెస్ దక్కుతుంది” అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద, చాలా కాలంగా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చిన మంచు మనోజ్‌కి “మిరాయి” ఒక మలుపు మార్పు సినిమా అయింది. ఈ విజయం ఆయన కెరీర్‌ని మరోసారి ట్రాక్‌లోకి తీసుకురావడమే కాకుండా, భవిష్యత్తులో టాప్ విలన్‌గా, అలాగే పాన్ ఇండియా స్థాయిలో కూడా ఒక స్ట్రాంగ్ మార్క్ సెట్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: