ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి....జగన్ 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేయనున్న నేపథ్యంలో ఈ సారి ఏ ఎమ్మెల్యే మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేస్తారని ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి. జిల్లాలు, కులాల సమీకరణాల ఆధారంగా ఆ ఎమ్మెల్యేకు మంత్రిగా ఛాన్స్ రావొచ్చు...ఈ ఎమ్మెల్యేకు ఛాన్స్ రావొచ్చని ప్రచారం నడుస్తోంది.

ఇదే క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తప్పుకుంటే, ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో సారథికి పదవి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే లక్ ఏమన్నా మారితే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు కూడా ఛాన్స్ దక్కే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే జగన్ మదిలో ఎవరు ఉన్నారనేది తర్వాత తెలుస్తుంది.

ఇక కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన బుర్రా, 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి, ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కష్టపడి 2019 ఎన్నికల్లో గెలిచారు.  ఎమ్మెల్యే అయ్యాక కనిగిరి ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.... పెన్షన్, రేషన్ కార్డుల్లో సమస్యలు ఉంటే ఆయనే దగ్గర ఉండి చూసుకుంటూ ప్రజలకు అండగా ఉంటున్నారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

కనిగిరిలో సంక్షేమ పథకాలు అమలులో ఎలాంటి ఇబ్బంది లేదు....అటు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, వాటర్ ట్యాంకులు, సి‌సి రోడ్లు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, జగనన్న కాలనీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల ముందు బుర్రా... ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సాగర్‌ నల్లా అందించే కార్యక్రమం చేపడతా అన్నారు. కానీ ఇప్పుడు ఆచరణలో లేదు.  ఇక్కడ ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు.

కనిగిరిలో మధుసూదన్ బలంగానే ఉన్నారు....అలా అని టి‌డి‌పి నేత ముక్కు ఉగ్రనరసింహరెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు. కనిగిరిపై ముక్కుకు మంచి పట్టు ఉంది. కాబట్టి ఎన్నికల వరకు మధుసూదన్ కష్టపడాలి. లేదంటే ముక్కుతో ఇబ్బందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: