సెలబ్రిటీలు ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వారు వాడే వస్తువులు, వాహనాల గురించి తరచూ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా కింగ్ ఖాన్ గా పిలవబడే షారుఖ్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే,షారుఖ్ కు కార్లు అంటే చాలా ఇష్టం. ఆయనకున్న మొత్తం కార్ల విలువ 34 కోట్ల రూపాయలట. ఇక ఆయనకున్న కార్లలో ఇక హాలీవుడ్ స్టార్లు ఎక్కువగా ఇష్టపడే రోల్స్ రాయిస్ కంపెనీ కార్లలో ఒకటైన ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూపె కారు ఈయనకుంది. దీని విలువ 10 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.

అయితే కింగ్ ఖాన్ షూటింగ్ సమయంలో మాత్రం మార్కెట్ లో ఉన్న లగ్జరీ కార్లలో కీలకమైన బెంట్లే కాంటినెంటల్ జీటీ కారు వాడతారు. దీని ఖరీదు 5 కోట్ల రూపాయలు. అన్నింటి కన్నా ఎక్కువ ఖరీదైన కారు బుగాటీ వేరన్. ఈ కారు ధర ఏకంగా 12కోట్ల రూపాయలు అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. జర్మనీలో తయారైన ఈ కారును షారుఖ్ జర్మనీ నుంచి తీసుకొచ్చేలా చేసుకోవడమే కాకుండా అభిరుచులకు తగ్గట్టు ఈ కారులో మార్పులు సైతం చేసుకున్నారు. ఈ దేశంలో బుగాటీ వేరన్ కారు ఉన్నఏకైక స్టార్ హీరో ఈయనే.

ఇక షారుఖ్ ఖాన్ దగ్గర బెంట్లే కాంటినెంటల్ జీటీ, బీఎండబ్ల్యూ 18, బీఎండబ్ల్యూ 6 సిరీస్ కన్వర్టిబుల్, రేంజ్ రోవర్ వోగ్, హ్యూందాయ్ క్రెటా 2020 కార్లు ఉన్నాయి. అలాగే తక్కువ విలువ చేసే ఐదు కార్లు కూడా ఉన్నాయట. టీవీ సీరియళ్ల ద్వారా నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర షోలకు సైతం యాంకర్ గా చేస్తున్నాడు. ఇక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: