IMDB : ఇంటర్నెట్ మూవీ డేటాబేస్.. ప్రపంచ ప్రపంచం సినిమా లవర్స్ కు దీని గురించి బాగా తెలుసు. ఇక IMDB కూడా ఇప్పుడు టాప్ తెలుగు 50 మూవీస్ ని విడుదల చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఆ తెలుగు సినిమాలు ఏమిటి..?ఐఎండిబి విడుదల చేసిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. శంకరాభరణం:
1980 లో రిలీజ్ అయింది.ఈ చిత్రాన్ని  డైరెక్టర్ కె విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. సోమయాజులు, మంజులభార్గవి లాంటి నటులు  ఈ మూవీలో నటించారు. ఇక ఈ చిత్రానికి IMDB ఇచ్చిన రేటింగ్ 8.7. టాప్ 50 లో 15వ స్థానాన్ని సంపాదించింది ఈ సినిమా.

2. అర్జున్ రెడ్డి:
2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ,  యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీని  సందీప్ రెడ్డి వంగా  డైరెక్టర్ గా వ్యవహరించారు. విజయ్ దేవరకొండ అలాగే శాలిని పాండే లు నటీనటులు.ఇక ఈ చిత్రానికి IMDB ఇచ్చిన రేటింగ్ 7.9.

3. క్షణం :
2016 లో రిలీజ్ అయ్యింది. ఇదొక థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ రవి కాంత్ ఈ మూవీని దర్శకత్వం వహించారు. అడవిశేషు , అనసూయ, ఆదా శర్మ లు మెయిన్ రోల్ ప్లే చేసారు. ఈ మూవీకి IMDB ఇచ్చిన రేటింగ్ 8.0.

4. అతడు:
2005లో రిలీజైంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. త్రివిక్రమ్ ఈ మూవీకి డైరెక్టర్. మహేష్ బాబు, త్రిష అలాగే బ్రహ్మానందం, ప్రకాష్ రాజు వంటి వారు నటించారు. ఈ మూవీకి IMDB ఇచ్చిన రేటింగ్ 8.0.

5. ఆ నలుగురు:
2004 లో రిలీజ్ ఇదొక ఎమోషనల్ డ్రామా చిత్రం. చంద్ర సిద్దార్థ్  ఈ మూవీను డైరెక్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్, ఆమని మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. అలాగే ఈ మూవీకి IMDB ఇచ్చిన రేటింగ్ 8.0.

6. బాహుబలి 2:
2017 లో రిలీజ్ అయింది. ఇదొక యాక్షన్ డ్రామా. ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేశారు. ఇక ఇందులో ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ మూవీకి IMDB ఇచ్చిన రేటింగ్  8.0.

ఇక ఈ చిత్రాలతో పాటు బొమ్మరిల్లు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జెర్సీ, సాగర సంగమం,C/o కంచరపాలెం , నువ్వు నాకు నచ్చావ్, మాయా బజార్ వంటి చిత్రాలు మొదటి 15 స్థానాల్లో నిలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: