సాధారణంగా సినిమా హీరోల ను పెళ్లి చేసుకోవాలని యువతులు ఎక్కువగా ఆశ పడుతూ ఉంటారు. ఇక ఏదో ఒక సినిమాలో హీరో లను చూసి వారి మీద మనసు పడటం వారిని ఒక్కసారి కలిస్తే చాలు అని ఆశపడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అభిమాన హీరోల ను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారూ ఎంతో మంది యువతులు. ఇలా దాదాపుగా సినిమా హీరోల అందరికీ కూడా ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ఉండటం కామన్.
 ఇక ఛాన్స్ దొరికితే ఇక తమ అభిమాన హీరోల ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎప్పుడూ రెడీగా ఉంటారు ఎంతోమంది అమ్మాయిలు. కానీ అలాంటి ఛాన్స్ రాదు కదా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని సర్దుకోవడం చేయాలని  భావిస్తూ ఉంటారు.


 అదే నిజంగా ఏకంగా సినిమా హీరో ని పెళ్లి చేసుకుని ఛాన్స్ వస్తే.. ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది అనుకొని ఎగిరి గంతులేస్తూ ఉంటారు. అయితే ఒక హీరో పై క్రష్ ఏర్పడి ఆ హీరో ని ఒక్కసారి కలిస్తే చాలు.. ఒక్కసారి ముట్టుకుంటే చాలు అని ఎంతో ఆశపడే ఒక అమ్మాయి స్నేహితురాలు ఇక అదే హీరో ని పెళ్లి చేసుకుని భార్య గా మారితే... ఇక అమ్మాయి కి ఊహించని షాక్ తగులుతుంది అనే చెప్పాలి. తన లైఫ్ లో కూడా ఇలాంటి ఘటన ఎదురైంది అని చెప్పింది బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మీరా రాజ్ పుత్.


 షాహిద్ కపూర్ ఇష్క్ విష్క్ అనే సినిమాలో హీరోగా నటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమయంలో తనకు 7 ఏళ్ల వయసు అంటూ షాహిద్ కపూర్ భార్య మీరా రాజపుత్ తెలిపింది. ఇక ఆ సమయంలో షాహిద్ కపూర్   ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు  తన స్నేహితురాలికి అతడి మీద ఎంతగానో క్రష్ ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన పెళ్లి జరగబోతుంది అని చెప్పిన సమయంలో.. తన ఫ్రెండు ఒక్కసారిగా షాక్ అయింది అని.. ఇటీవలే ఒక పార్టీలో ముగ్గురం కలిసి ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ ఎంతగానో నవ్వుకున్నాము అంటూ మీరా రాజ్ పుత్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: