టాలీవుడ్ మహా సంస్థానంకి మూల స్తంభాలుగా.. స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున లను నాలుగు మూల స్తంభాలని అంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ రారాజుల తర్వాత వీరి వారసులు కూడా అదే స్థాయిలో ఇండస్ట్రీలో రాణించాలని అలరించాలని అభిమానుల ఆకాంక్ష. అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరు వారసుడు రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుండగా, అక్కినేని నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ లు కూడా వరుస చిత్రాలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కుమార్తెలు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారన్నది తెలిసిందే.

ఇక మిగిలింది నందమూరి బాలకృష్ణ ఏకకై పుత్ర రత్నం మోక్షజ్ఞ. 1994 సెప్టెంబర్ 6 మోక్షజ్ఞ జన్మించాడు. ఇపుడు అతడి వయసు 27 సంవత్సరాలు కాగా అందరి చూపు నందమూరి యువరత్నం పైనే ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జూనియర్ బాల సింహం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. గత ఆరేళ్లుగా మోక్షజ్ఞ హీరోగా రాబోతున్నారు అన్న వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ అది జరుగలేదు. అయితే త్వరలో నందమూరి అభిమానుల కల నెరవేరేలా సూచనలు అందుతున్నాయి. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పై భారీ అంచనాలే ఉన్నాయి.

మరి మోక్షజ్ఞ ఎలాంటి స్వభావం కలవాడు, అతడి నటన ప్రతిభ ఏంటో చూడాలని తెలుసుకోవాలని అందరికీ ఉంది. అయితే మోక్షజ్ఞ కూడా తండ్రికి తగ్గ తనయుడు, తాత తారకరామారావు నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ధీరుడు అని నందమూరి సన్నిహితులు చెబుతున్నారు. మోక్షజ్ఞ చాలా మృదు స్వభావి అట, అయితే యాక్టింగ్ మాత్రం  ఇరగదీస్తాడని తాత కు, తండ్రికి ఏమాత్రం తగ్గడని దగ్గరి బంధువులు అంటున్నారు. అయితే బాలకృష్ణ లాగా దబిడి దిబిడి వ్యవహారం కాదని మీడియా చూసిన కొన్ని సందర్భాలలో అతని బిహేవియర్ వల్ల అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: