టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెంచేశాయి.  అలా ప్రేక్షకుల్లో మంచి అంశాలు కలిగి ఉన్న ఈ సినిమా ను జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి కలెక్షన్ ల వర్షం కురిపించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తండ్రి పాత్రలో కూడా నాగార్జున నే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్ర ఈ సినిమాలో కొంత సమయం మాత్రమే చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇలా నాగార్జున ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని ఒక టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: