అఖండతో అదిరిపోయే రేంజ్ లో హిట్ అందుకున్న బాలకృష్ణ. తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాకి కూడా అదే రేంజ్ లో రిజల్ట్ రావాలని చూస్తున్నాడు. క్రాక్ తో డైరక్టర్ గా తన సత్తా చాటిన గోపీచంద్ మలినేని రవితేజ తర్వాత అందుకున్న మొదటి స్టార్ ఛాన్స్ ఇదే అని చెప్పొచ్చు. అందుకే బాలయ్య సినిమాని నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా నుండి స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. బాలయ్య 107వ సినిమా జనవరి 21 నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారట. జగిత్యాలలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ చేస్తారని తెలుస్తుంది. సినిమాలో లీడ్ యాక్టర్స్ అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని టాక్. శృతి హాసన్ తో పాటుగా ఈ సినిమాలో కోలీవుడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమెది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. ఆల్రెడీ క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆమె తన సత్తా చాటనుందని తెలుస్తుంది.

మాస్ సినిమాలు బాగా చేసే గోపీచంద్ మలినేని ఫస్ట్ టైం మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని అంటున్నారు. సినిమాను 3 షెడ్యూల్ లోనే మ్యాక్సిమం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు అనీల్ రావిపుడి, పూరీ జగన్నాథ్ లతో సినిమాలు లైన్ లో పెట్టాడని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: