అఖిల్‌ బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గ హిట్‌ కోసం ఏడేళ్ల పాటు ఎదురుచూశాడు. ఫైనల్‌గా గతేడాది వచ్చిన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్'తో సక్సెస్‌ ట్రాక్ ఎక్కాడు. ఇక తెలుగులో వచ్చిన ఫస్ట్ హిట్‌తో ఇప్పుడు బాలీవుడ్‌కీ వెళ్లాలనుకుంటున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ చేస్తోన్న 'ఏజెంట్' సినిమాని పాన్‌ ఇండియన్‌ మూవీగా డిజైన్‌ చేస్తున్నారనే టాక్ వస్తోంది.

నాగచైతన్య ఇప్పటికే హిందీ సినిమాల్లో అడుగుపెట్టాడు. ఆమిర్‌ ఖాన్‌ 'లాల్‌ సింగ్ చడ్డా'లో ఒక కీ-రోల్ ప్లే చేస్తున్నాడు నాగచైతన్య. అమెరికన్‌ మూవీ 'ఫారెస్ట్ గంప్' రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాలో చైతన్య సోల్జర్‌గా నటిస్తున్నాడు. ఇక ఆమిర్‌ ఇమేజ్‌తో మంచి గుర్తింపు వస్తే, చైతన్య సినిమాలు హిందీలోనూ రిలీజ్ అయ్యే అవకాశముందని చెప్పొచ్చు.

విజయ్‌ దేవరకొండకి 'అర్జున్‌ రెడ్డి'తో తమిళ్, హిందీ పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'నోటా' అని తెలుగు, తమిళ్‌ బైలింగ్వల్‌ చేస్తే అది కాస్తా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడింది. తెలుగు, తమిళ్, మళయాళ, కన్నడలో రిలీజైన 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ బైలింగ్వల్‌ 'లైగర్' చేస్తున్నాడు. కమర్షియల్‌ మూవీస్‌కి దూరంగా, యూనిక్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తాడని అడివి శేష్‌కి సెపరేట్‌ ఇమేజ్‌ ఉంది. డిఫరెంట్‌ స్టోరీస్‌తో తెలుగునాట సెపరేట్‌ మార్కెట్‌ తెచ్చుకున్న అడివి శేష్‌ ప్రస్తుతం 'మేజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ముంబాయి 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ బయోపిక్‌గా వస్తోంది 'మేజర్'. ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా తెరకెక్కుతోంది.

రామ్ ఇప్పటివరకు తెలుగులో తప్ప మరో భాషలో సినిమాలు చేయలేదు. అయితే ఫస్ట్ టైమ్‌ లింగుసామి సినిమాతో తమిళ ఇండస్ట్రీకి వెళ్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెలుగు, తమిళ్లో ఒక బైలింగ్వల్‌ మూవీ వస్తోంది. ఇక ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా డబ్‌ చేసే అవకాశముందని తెలస్తోంది. మాస్‌ మూవీస్‌తో తెలుగునాట స్టార్డమ్ సంపాదించుకోవాలని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఆ మాస్‌ హిట్‌ మాత్రం రాలేదు. ఇక హిందీనాట ఈ మధ్యకాలంలో తెలుగు మాస్‌ మూవీస్‌కి భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటూ ప్రభాస్‌ 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో  తెరకెక్కుతోందీ హిందీ 'ఛత్రపతి'.


మరింత సమాచారం తెలుసుకోండి: