హాట్ హీరోయిన్ మాళవిక మోహన్ ఒక చిట్ చాట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సమంత ప్రతి విషయం లో కూడా రిస్క్ తీసుకోవడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 చేయడం అనేది ఆమె తీసుకున్న అతి పెద్ద రిస్క్ అని చెప్పింది.ఇక అందువల్లే ఇప్పుడు బాలీవుడ్ లో ఆమెకు మంచి గుర్తింపు అనేది దక్కింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.ఇక సమంత కెరీర్ మొత్తంలో కూడా ఎన్నో సార్లు పాత్రల ఎంపిక విషయంలో రిస్కు తీసుకుంది అంటూ మాళవిక మోహన్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సమంత యంగ్ హీరోయిన్స్ కి ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది అని మాళవిక పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఐటం సాంగ్స్ కూడా చేస్తూ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా దుమ్ము రేపుతూ బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.


ఇక తాజాగా సమంత నటించిన 'శాకుంతలం' సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. అలాగే మరోవైపు పాన్ ఇండియా మూవీ యశోద అనే విభిన్నమైన సినిమా తో కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఉత్తరాదిన ఈమె వెబ్ సిరీస్ లు ఇంకా అలాగే హిందీ సినిమాలతో ఫుల్ బిజీబిజీగా మారబోతుంది.ఇక అలాంటి సమంతపై మాళవిక మోహన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఉన్నట్టుండి సమంతపై మాళవిక ఈ కామెంట్స్ చేయడం వెనుక వున్న ఉద్దేశం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్ ఫ్యాన్ బేస్ ను తనవైపుకు తిప్పుకునేందుకు మాళవిక ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తుంది అనేది కొందరి అబిప్రాయం.అయితే అసలు విషయం ఏంటా అనేది కేవలం ఆమెకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: