దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..మన తెలుగు సినిమా ఖ్యాతిని వైబోగంని ప్రపంచ నలుమూలల విస్తరింప చేసేలా చేసింది ఈ సినిమా...ప్రభాస్ ని ఈ సినిమా పాన్ ఇండియా సూపర్ స్టార్ గా నిలబెట్టింది..ముఖ్యంగా ఉత్తర భారత దేశం లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలు విషయం కాదు..ఇప్పటికి ఈ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ స్థానం లోనే కొనసాగుతుంది..ఈ సినిమా వసూళ్లను దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం #RRR పెద్ద సెన్సషనల్ హిట్ అయిన కూడా దాటలేకపోయింది అంటే బాహుబలి సృష్టించిన కలెక్షన్ల సునామి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు..ఇది ఇలా ఉండగా ఈ కథ పుట్టడానికి ముందుగా చాలా వెర్షన్లు అనుకున్నాడట రాజమౌళి మరియు అతని తండ్రి..ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన ఈ కథ రూపాంతరం చెందే ముందు చెప్పిన రెండు మూడు వెర్షన్లు ఇప్పుడు సోషల్ మీడియా లో  తెగ వైరల్ గా మారింది.


 సినిమా ప్రారంభం లో సుదీప్ మరియు సత్యరాజ్ మధ్య ఒక్క కత్తి ఫైట్ ఉంది కదా..వాస్తవానికి ఈ కథ అక్కడి నుండే ప్రారంభం అవ్వాలట ..ఒక్క రోజు దేశ వ్యాప్త పర్యటన కోసం ఒక్క రాజు(సుదీప్) అన్ని ప్రాంతాలు తిరుగుతూ అలా మాహిష్మతి కి కూడా చేరుకుంటాడు..మాహిష్మతిలో ఎతైన భవనాలు, సుదరవంతమైన ప్రదేశాలు చూసి ఎంతగానో పులకరించిపోతాడు ఆ రాజు..అలా రాజా కోట ఆవరణలో కట్టప్ప తన శిష్యులకు కత్తి సాము నేర్పించడం చూసి బాగా ఆశ్చర్యపోతాడు ఆ రాజు..ఇంత వీరోచితంగా వీరుడిని నేను ఇటీవల కాలం లో ఎప్పుడు చూడలేదు అని ఆశ్చర్యపొయ్యి కట్టప్ప ని కలిసి,తమ రాజ్యం నుండి ఆయుధాల సరఫరా ప్రతిపాదననని తీసుకొస్తాడు..ముందుగా ఆయుధాలను పరీక్షించడానికి కట్టప్ప తన తో కత్తి సాము చెయ్యమని ఆ రాజుని అడగగా, అందుకు అంగీకరించి కత్తి సాము లోకి దిగుతాడట ఆ రాజు..ఉరుము మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కట్టప్ప కత్తి సాము ప్రత్యర్థి కత్తి మీద పడితే..ఆ దాటికి కత్తి సాము చేస్తున్న ఆ రాజు కత్తి విరిగిపోతుందట.




అది చూసి ఆశ్చర్యపోయిన ఆ రాజు ' ఎవరు నీవు..నీలాంటి యోధుడు ని నేను నేరుగా చూడడం ఇదే తొలిసారి' అంటూ ప్రశ్నిస్తాడు కట్టప్ప ని ఆ దేశ రాజు..అప్పుడు కట్టప్ప దానికి సమాధానం ఇస్తూ 'నేను నా రాజు బాహుబలి తరుచు ఇక్కడ సాధన చేస్తూ ఉండేవాళ్ళం..అతను ఎలాంటి వాడో తెలుసా..యుద్ధం లో అతని కత్తి ఎటు దాటికి ఎదురు నిలబడే మొనగాడు ఇప్పటి వరుకు ఈ భూమి మీద జన్మించలేదని .యుద్ధం లోకి దిగితే అతడు మహాభారతం లో అర్జునితో సరిసమానమైన యోధుడని ఒక్క రోజు యుద్ధం చేస్తూ ఉండగా అతని శరీరం మొత్తం రక్తం తో నిండిపోయిందని అది అతని శరీరం నుండి వచ్చిన రక్తం కాదు..శత్రువులను చీల్చి చెండాడిన తర్వాత అతని వంటి మీద వారి రక్తం అలా చిమ్మిందని .అతని శరీరం పై ఒక్క ఘాటు పెట్టిన మొనగాడు కూడా ఇప్పటి వరుకు పుట్టలేదు' అంటూ కథని చెపుకొస్తాడట కట్టప్ప..ఇదంతా విన్న ఆ రాజు ఆశ్చర్యపొయ్యి, ఎవరు అతను..ఒక్కసారి నాకు అతనిని చూసే అదృష్టం కలగనివ్వు అంటూ కట్టప్ప ని అడుగుతాడట ఆ రాజు..అప్పుడు కట్టప్ప దానికి సమాధానం చెప్తూ 'అతను ఇప్పుడు సజీవంగా లేదు..చనిపోయాడు' అంటూ చెప్పుకొస్తాడు..అదేంటి అతని మీదకి కత్తి దూసే మొనగాడు ఇంకా పుట్టలేదు అన్నావ్, మరి ఎవరు చంపారు అని ఆ రాజు అడగగా..నేనే వెన్నుపోటు పొడిచి చంపాను అంటూ చెప్పుకొస్తాడట కట్టప్ప..ఇక్కడితో పార్ట్ 1 ముగుస్తుంది..ముందుగా అనుకున్న వెర్షన్ ఇది..ఇది కూడా అద్భుతంగా ఉంది కదూ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: