క్షణం, గుడాచారి,ఎవరు లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ఏ బ్యాక్ గ్రౌండ్ కూడా లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్‌. ఇతను చేసింది తక్కువ సినిమాలే అయినా కొత్తదనం కోసం అతడు పడే తాపత్రయం అతడిని ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులను చేరువ అయ్యేలా చేసింది.ఇక తాజాగా అతడు నటించిన సినిమా మేజర్‌. 26/11 రియల్‌ హీరో మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొంది తెరకెక్కిన సినిమా కావడం ఇంకా రిలీజ్‌కు ముందే ప్రీమియర్లు, అంచనాలు అన్నిటికంటే మరీ ముఖ్యంగా దీనికి తోడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో మేజర్‌ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ముంబై 26/11 దాడులపై గతంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ మేజర్ సినిమాను మాత్రం దర్శకుడు శశికిరణ్.. నటీనటుల నటన, కాస్ట్యూమ్స్‌, మ్యూజిక్‌, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి అంశంలో అన్నింటిని పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి మరీ బాగా ప్రజెంట్ చేశాడు.



అసలు అడివి శేష్ మేజర్‌లో ఉన్ని కృష్ణన్‌గా తన కెరీర్ బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చాడు. చదువుతున్న కుర్రాడిగా, యుక్త వయస్కుడిగా, లవర్ బాయ్‌గా ఇంకా దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడిగా తన పాత్రలో అలా ఒదిగిపోయాడు.హోటల్లో ఉగ్రవాదుల అరాచకాలు ఇంకా వారిని మట్టుపెట్టేందుకు సందీప్ ఉన్నికృష్ణనన్ వ్యూహాలు ఇంకా ఇలాంటి టైంలో మీడియా అత్యుత్సాహం వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ బాగా చూపించారు. ఇక చివరి 20 నిమిషాలు అయితే ప్రేక్షకుడు సీట్‌కు అతుక్కుపోయి చూస్తూ ఉంటాడు. ఓ వైపు ఒంటినిండా బుల్లెట్లు దిగి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా మేజర్ సందీప్ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోట్లకు వెళ్లి చివరి క్షణం వరకు దేశం కోసం పోరాటం చేయడం ప్రేక్షకులను అయితే కంటతడి పెట్టిస్తుంది.ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సెల్యూట్ చెయ్యాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: