టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలే చేసింది సురేఖా వాణి. వదిన మరియు అక్క పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.



ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాల్లో కూడా ఎంతో అద్భుతంగా నటిస్తుంటుంది. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేఖావాణికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు సుప్రీత. తన కూతురు కూడా నటిగా ఎంట్రీ ఇస్తుందని చెబుతుంటుందట సురేఖావాణి.


ఇప్పటికే సుప్రీత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. వెండితెరపై ఇంకా ఎంట్రీ ఇవ్వన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సెలబ్రిటీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది సుప్రీత. అలానే తన తల్లితో కలిసి ఉన్న కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. సురేఖావాణి, సుప్రీత తల్లీకూతుళ్లయినప్పటికీ మంచి స్నేహితుల్లా మెలుగుతుంటారు. ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్తూ అక్కడి వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు.


 


అయితే వీరిద్దరి డ్రెస్సింగ్ విషయంలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుంటారట. భర్త చనిపోయినప్పుడు సురేఖావాణి బాధ కూడా లేకుండా ట్రిప్ కి వెళ్లి ఎంజాయ్ చేశారంటూ విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్ పై సుప్రీత ఘాటుగా స్పందించింది. 'మేం ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు..మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా..?' అంటూ ప్రశ్నించిందట. 'నా తండ్రి చనిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో.


 


ఎవరైనా చూశారా..? మా అమ్మ కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోయిందని. అందుకే ఆమెని దూరంగా తీసుకువెళ్లాలని బ్యాంకాక్ కి తీసుకెళ్లా. కానీ అలా వెళ్లినందుకు దారుణమైన కామెంట్స్ చేశారు. నాన్న చనిపోయాడన్న బాధ నుంచి అమ్మను బయటకు తీసుకువచ్చి.. మామూలుగా చేస్తుంటే.. రకరకాల కామెంట్స్ వినాల్సి వచ్చింది' అంటూ తను ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: