మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం అదే జోష్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అవుతుంది. శంకర్ కూడా ఈ సినిమా షెడ్యూల్ ... షెడ్యూల్ కు మధ్య పెద్ద గ్యాప్ లేకుండా శర వేగంగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు. అందువల్ల ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సునీల్ ,  అంజలి ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ,  దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.  ఈ మూవీ లో దర్శకుడు మరియు నటుడు ఆయన ఎస్ జే సూర్య ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శంకర్ ఒక అదిరిపోయే భారీ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ ఐటమ్ సాంగ్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని తీసుకోవాలని మూవీ యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఐటమ్ సాంగ్ ని భారీ ఖర్చుతో సూపర్ గ్రాండ్ గా తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని శంకర్ తన పూర్వ సినిమాల మాదిరి గా భారీ ఖర్చుతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: