ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ పై విమర్శల వర్షం అస్సలు తగ్గటం లేదుగా. దేశవ్యాప్తంగా ఆదిపురుష్‌ను ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాసిరకం గ్రాఫిక్స్‌పై భారీ సెటైర్స్ పడుతున్నాయట..


బాలీవుడ్ సీరియల్స్‌లో ఇంత కంటే క్వాలిటీతో గ్రాఫిక్స్ ఉంటాయని నార్త్ నెటిజన్స్ కూడా అంటుంటే.. రజినీకాంత్ ఫ్లాప్ మూవీ 'కొచ్చాడియాన్' చాల బెటర్ అని తమిళ తంబీలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ టీజర్ చూశాక.. మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా'పై గౌరవం పెరిగిందని తెలుగులో యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే రచయిత, నటుడు ఎస్ఎస్ కాంచి చేసిన ఓ సెటైరికల్ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈయన రాజమౌళికి సోదరుడు కాగా కీరవాణికి సొంత తమ్ముడు. అమృతం' సీరియల్ తో నటుడిగా అలరించిన కాంచీ.. 'సై' వంటి పలు చిత్రాలతో మెప్పించారు. రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలకు తనవంతు భాగస్వామ్యం కూడా అందిస్తుంటారు కాంచి.



ఇక భాషపై మంచి పట్టుండే ఈ రచయిత తాజాగా పోస్ట్ చేస్తూ.. "పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి" అని కామెంట్స్ చేశాడు. రామాయణం వంటి పౌరాణికాలు రాజమౌళినే తీయగలడన్న అర్ధం వచ్చేలా ఎస్ఎస్ కాంచి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి మహాభారతం, రామాయణం రెండు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఆ సినిమాలని తీయగలిగే సత్త తనకు వచ్చిన రోజు తీస్తానని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇతిహాసం రామాయణం ఆధారంగానే ఆదిపురుష్ తెరకెక్కింది. భారీ అంచనాలతో నిన్న విడుదలైన ఈ టీజర్‌కి మిశ్రమ స్పందన వస్తుంది. 'ఇండియన్ అవతార్' అని కొందరు కాంప్లిమెంట్ చేస్తుంటే.. 'ఆదిపురుష్' టీజర్‌లో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అస్సలు బాలేవని.. 'రామాయణం'ను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సరైన విధంగా హ్యాండిల్ చేయలేదని ట్రోల్స్ కూడా వస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: