వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న హీరో నాని ఇప్పుడు ఓ మాస్ మసాలా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంటే సుందరానికి లాంటి భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టాలన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో దసరా సినిమా లో నాని హీరోగా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. పూర్తి స్థాయి మాస్ సినిమా గా ఇది ఉండబోతుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తప్పకుండా నాని కి సూపర్ హిట్ ను తీసుకొస్తుందని అయన భావిస్తున్నారు.

ఇక] పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ సినిమా కు  తమిళ సంగీత దర్శకడుు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ సంగీత దర్శకుడు ఏ స్థాయి లో అలరిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయన గత సినిమా విరాటపర్వం ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్‌లతో పాటు సాయికుమార్, సముద్ర ఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గతంలో కీర్తి సురేష్ నానితో నేను లోకల్ సినిమా చేయగా అది సూపర్ హిట్ గా మారింది. ఇక ఈ సినిమా మార్చి 30, 2023న భారీగా థియేటర్లలో విడుదల కానుంది. అది అలా ఉంటే నాని అభిమానులు ఈ సినిమా ను రీసెంట్ గా విడుదలైన కాంతారా సినిమా తో పోల్చడం నిజంగా విశేషం అనే చెప్పాలి. కాంతారా సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సినిమాతో పోల్చడం నిజంగా సినిమా కు ప్లస్ అవుతుందనే చెప్పాలి. మరి ఎన్నో అంచనాలు పెట్టుకుని చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఇకపోతే నానిసినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: