సినిమా పరిశ్రమ లో దర్శకులుగా మారడం ఎంతో కష్టం. దీనికి ఎంతో సమయం తీసుకుంటుంది. అలాంటిది తన వద్ద పనిచేసిన వారికి త్వరగా అవకాశాలు వచ్చేలా చేస్తున్నాడు సుకుమార్. తన వద్ద పనిచేసిన కొంత మంది శిష్యుల్ని దర్శకులుగా పరిచయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు సుకుమార్.ఇప్పటికే బుచ్చిబాబు ను దర్శకుడిగా పరిచయం చేసి ఆకట్టుకున్న సుకుమార్ తన వద్ద పనిచేసిన మరికొంతమంది ని కూడా అలాగే చేస్తూ గురువు అనిపించుకున్నాడు.

గతంలో పెద్ద దర్శకులు ఇలా చేసేవారు. తమ వద్ద పనిచేసిన వారిలోని టాలెంట్ ను గమనించి అవకాశాలు ఇప్పించే వారు. అలా వారితర్వాత సుకుమార్ ఇలాంటి పనిచేయడం విశేషం. ఇప్పటికే 'కరెంట్' మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన పల్నాటి సూర్య ప్రతాప్ ని 'కుమారి 21 ఎఫ్'తో వార్తల్లో నిలిచేలా చేసిన సుకుమార్ ప్రస్తుతం అతన్ని మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ల జాబితాలోకి తీసుకురాబోతున్నారు.

అయన 18 పేజెస్ డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేపే ఈ సినిమా విడుదల కాబోతుంది.  ఈ సినిమా కోసం సుకుమార్ నిర్మాత గా కూడా వ్యవహరించాడు.  నిఖిల్ అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీకి జీఏ2 పిక్చర్స్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా వ్యవహరించింది. తన ప్రతి సినిమా కథ లో భాగమయ్యే సూర్య ప్రతాప్ కోసం పెద్ద నిర్మాణ సంస్థ ను సెట్ చేశాడట సుకుమార్. '18 పేజెస్' సక్సెస్ అయితే సుకుమార్ అనుకున్నట్టే దర్శకుడిగా నిలబడే అవకాశం వుంది. మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమా పై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే మొదటిభాగం సంచలన విజయాన్ని అందుకోగా ఇప్పుడు ఈ రెండో భాగం పై అందరి లో అంచనాలు మెండుగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: