టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె అనంతరం వరుస  సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె దాని అనంతరం స్టార్ హీరోల సరసన  హీరోయిన్గా  నటించింది. ఆ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడ్డ ఈమె  తర్వాత నాగచైతన్యతో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత వర్సెస్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

తర్వాత ఈమె షూటింగ్ లో పడి వర్క్ అవుట్ లు ఎక్కువగా చేయడం వల్ల దాంతోపాటు విడాకులు అనంతరం డిప్రెషన్ లోకి వెళ్లిన సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి రావడం జరిగింది. ప్రస్తుతం సమంత ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ను కూడా తీసుకుంటుంది. తాజాగా ఈమె నటించిన షాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.  ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళితే..  చైతన్య ను సమంత ఇంకా మర్చిపోలేదు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి.

అయితే దీనికి కారణం ఆమె పెట్టే పోస్టులు. అయితే సమంత మయోసైటిస్ అనే వ్యాధిన పడినప్పటి నుండి సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. తాజాగా సమంత తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ నా జీవితం మునపటిలా లేదు ఉంటే బాగుండేదేమో అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది సమంత. దీంతో సమంత చేసిన కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు సమంత ఇలా మాట్లాడుతుంది.. నాగచైతన్యని ఇంకా మరిచిపోయినట్టు లేదు.. అందుకే సమంత ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లను చేస్తున్నారు చాలా మంది నెటిజన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: