ప్రస్తుతం ఎక్కడ చూసినా “కాంతార” అనే పేరే మారుమ్రోగిపోతుంది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, ఇండస్ట్రీ రికార్డులకే సవాల్ విసురుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు రిషబ్ శెట్టి నటనను, రుక్మిణి వసంత్ అందాలను, అలాగే రిషబ్ శెట్టి యొక్క అద్భుతమైన దర్శకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఒక వివాదాస్పద అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. “హోంబలే ఫిలిమ్స్” అనే ప్రొడక్షన్ హౌస్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కారణం ఏమిటంటే — ఈ సినిమా ప్రమోషన్‌లో బుక్ మై షో యాప్‌ ద్వారా చూపిస్తున్న టికెట్ సేల్స్ డేటా మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సాధారణంగా బుక్ మై షో యాప్‌లో ఒక సినిమాకు గంటకు ఎన్ని టికెట్లు అమ్ముడవుతున్నాయి అన్నది చాలా జెన్యూన్‌గా చూపిస్తుందని అందరూ నమ్ముతారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు మాత్రం ఆ విశ్వాసాన్ని కుదిపేశాయి. “కాంతార” మొదటి రోజు యాప్‌లో గంటకు 90,000 టికెట్లు అమ్ముడవుతున్నాయి అని చూపించగా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ స్థాయిలో కలెక్షన్లు నమోదుకాలేదు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, గంటకు 90 వేల టికెట్లు అమ్ముడయ్యే స్థాయిలో ఉన్న సినిమా కనీసం 130 కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్ సాధించాల్సి ఉంది. కానీ “కాంతార” మాత్రం మొదటి రోజున 89 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే సాధించింది. దీంతో చాలామంది సినిమా ప్రేమికులు, ట్రేడ్ అనలిస్టులు ఈ విషయంపై ఆరాతీశారు. చివరికి బుక్ మై షోలో చూపించిన టికెట్ సేల్స్ నెంబర్లు ఫేక్‌గా మానిప్యులేట్ చేయబడ్డాయి అన్న వాదనలు బలంగా వినిపించాయి.



ఇక రెండో రోజు పరిస్థితి కూడా ఇంతకంటే తక్కువేమీ కాదు. తెలుగు, కన్నడ వెర్షన్లలో సినిమా బాగానే వసూళ్లు సాధించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించాయి. అయినప్పటికీ బుక్ మై షో యాప్‌లో మాత్రం గంటకు 60 వేల నుండి 90 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి అని చూపించబడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, రెండో రోజు “కాంతార” గ్రాస్ సుమారు 40 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ యాప్‌లో చూపిస్తున్న డేటా మాత్రం దానికంటే చాలా ఎక్కువగా ఉంది. దీనితో సినిమా మేకర్స్ ఉద్దేశపూర్వకంగా ఈ ఫీచర్‌ను మానిప్యులేట్ చేశారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.



అదే కాదు — దీని వెనుక ప్రత్యేకంగా పని చేసిన ఒక డిజిటల్ ప్రమోషన్ టీమ్ ఉందని సమాచారం. టికెట్ సేల్స్ ఎక్కువగా చూపించి సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం ఈ టీమ్ ప్రధాన ఉద్దేశమని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.ఈ వ్యవహారం “కాంతార” సినిమాకు మాత్రమే పరిమితం కాదని, గతంలో కూడా పలు పెద్ద సినిమాలు ఇలాంటి ట్రిక్స్‌ ఉపయోగించాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రేక్షకులకు తమ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అర్థమయ్యేలా చూపించడానికి ఇప్పుడు చాలామంది మూవీ మేకర్స్ ఇలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్  నేర్చుకున్నారని అంటున్నారు.



ఇదంతా తెలిసి కొంతమంది సినీ ప్రేమికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. “సినిమా నిజంగా బాగుంటే ప్రజలు దాన్ని హిట్ చేస్తారు; ఫేక్ నంబర్స్ చూపించాల్సిన అవసరం లేదు” అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం “ఇది మొత్తం ఒక ప్రమోషనల్ స్ట్రాటజీ మాత్రమే, నిజానికి సినిమా బాగానే ఆడుతోంది” అని చెప్పుతున్నారు.ఏదేమైనా, “కాంతార” చుట్టూ ఏర్పడిన ఈ టికెట్ సేల్స్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌గా మారిపోయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో చూడాలి కానీ, ప్రస్తుతం మాత్రం “హోంబలే ఫిలిమ్స్” పై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: