దర్శకతీరుడు రాజమౌళి తన సినిమాలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాలతో ప్రస్తుతం ఒక రేంజ్ లో హవా నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుండా అందరూ స్టార్ హీరోలు ఇక రాజమౌళితో ఒక సినిమా తీస్తే చాలు అనుకునే విధంగా ప్రస్తుతం క్రేజ్ సంపాదించాడు రాజమౌళి. అయితే ఇలా రాజమౌళితో సినిమా తీయాలని ఆశపడే హీరోలు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ గురించి తెలిసి మాత్రం కాస్త ఆందోళన చెందుతూ ఉన్నారు అని చెప్పాలి.


 ఒకవేళ రాజమౌళి నుంచి సినిమా చేసేందుకు పిలుపు వచ్చిన కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ గురించి భయపడుతూనే.. చివరికి సినిమా పూర్తి చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి అంటే రాజమౌళితో సినిమా చేసిన హీరో ఇక ఆ తర్వాత సినిమాలలో సక్సెస్ అందుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఇప్పటివరకు ఎంతో మంది హీరోల విషయంలో ఇది నిజమైంది అని చెప్పాలి. రాజమౌళితో సినిమా తర్వాత చాలామంది హీరోలు ప్లాపులతో సతమతమయ్యారు. పాన్ ఇండియా రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కి కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అయితే ఇక త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు నటించారు.

 ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే చరణ్ తారక్ ఇద్దరి అప్కమింగ్ సినిమాలకు కూడా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. చరణ్ శంకర్ తో సినిమా చేస్తుండగా.. తారక్ కొరటాల శివ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ ని అనౌన్స్ చేశాడు. రెండు సినిమాలపై భారీ అంచనాలే  ఉన్నాయి. అయితే ఇక ఇద్దరు హీరోల సంబంధించిన సినిమాల బజ్ చూస్తే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను ఇద్దరు హీరోలు బ్రేక్ చేస్తారు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: