ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అల్లు అర్జున్ తన నటన తో ... డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బ్లాక్బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అల్లు అర్జున్ కొంత కాలం క్రితం సుకుమార్ దర్శకత్వంలో రూపొందినటు వంటి పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో సునీల్ , అనసూయ , రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ , తమిళ్ భాషలో విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం మనకు తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ నుండి గిమ్స్ వీడియోను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో వెలువడనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: