టాలీవుడ్ లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలే కాకుండా వాటిని ప్రేక్షకులకు మెచ్చే విధంగా మల్చడంలో ఈ హీరో దిట్ట అని చెప్పవచ్చు. ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మీటర్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం పక్క కాపు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరుగుతోంది.


సినిమా పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులకు మంచి బజ్ వచ్చేలా చేశాయి.. తాజాగా ఈ సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీటర్ మూవీ ట్రైలర్ ఈనెల 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది .ఈ చిత్రాన్ని రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.


ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకునేందుకు కిరణ్ అబ్బవరం సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అతుల్య రవి, హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు.. సాయి కార్తీక్ ఈ చిత్రాన్ని సంగీతం అందించడం జరిగింది. మరి మీటర్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మార్చి 29 వరకు ఆగాల్సిందే.. కిరణ్ అబ్బవరం ఎక్కువగా గీత ఆర్ట్స్-2 బ్యానర్ పైన వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం ఇంతగా ఎదగడంతో అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: