ప్రియాంక అరుల్ మోహన్ మొదటి సినిమాతోనే ఎలాంటి గ్లామర్ ఇంకా హాట్ షో చెయ్యకుండా తెలుగు ప్రేక్షకులకు తన నటనతో ఇంకా అందంతో ఎంతగానో ఆకట్టుకుంది.టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ప్రియాంక మోహన్.ఇక ఆ సినిమా తర్వాత మరో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి సినిమా చేసింది. అలాగే తమిళ్ లో సూర్య, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ సినిమాలు తెలుగు కూడా చాలా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ తో కలిసి చేసిన వరుణ్ డాక్టర్ ఇంకా డాన్ సినిమాలు మంచి హిట్స్ సినిమాలుగా నిలవడమే కాకుండా ఈ బ్యూటీని సోషల్ మీడియా స్టార్ ని చేశాయి. అయితే ఈ క్యూట్ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయడానికి చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యణ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది.


పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజి సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది ఈ బ్యూటీ.చూడచక్కని అందమైన రూపం ఇంకా ఆకట్టుకునే నటన ఉన్న ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. దాంతో తమిళ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తిరిగి తెలుగులో నటిస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇన్ని రోజులు తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కూడా ఓ కారణం ఉందట. తెలుగులో చేస్తే స్టార్ హీరోల సినిమాల్లోనే చేయాలనీ ఆమె గట్టిగా ఫిక్స్ అయ్యిందట.తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోన్న ఈ బ్యూటీ తెలుగులో కూడా మహేష్, పవన్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తే చేద్దామని ఎదురుచూసిందట.. అందుకే తెలుగులో చిన్న గ్యాప్ వచ్చిందట. ఇప్పుడు ఇదే టాక్ ఫిలిం సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఓజి సినిమా షూటింగ్ లో ఇటీవలే జాయిన్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: