వయసు 25 సంవత్సరాలు అయ్యి, నెలకు వేతనం రూ.10వేలు అలాగే మీ పీఎఫ్ అకౌంట్ లో లక్ష రూపాయలు సేవ్ చేసి ఉంటే గనుక, ఉద్యోగి 12 శాతం తో పాటు యజమాని వాటా కూడా ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే మీకు 55 ఏళ్ళు వచ్చేసరికి మీ పీఎఫ్ అకౌంట్ లో రూ.38,14, 260 లక్షలు ఉంటుంది. అంటే 30 ఏళ్ల తర్వాత కాలంలో మీ ఆదాయం రూ.38 లక్షలు అవుతుంది...ఇక పీఎఫ్ అకౌంట్ నుండి మీరు లక్ష కనుక ఉపసంహరించుకుంటే, మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సున్నా అవుతుంది.. అనంతరం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కొనసాగినప్పటికీ 55 ఏళ్ల తర్వాత కాలానికి రూ.26,09, 290 అవుతుంది. అంటే మీరు రూ.1లక్ష ఇప్పుడు కరోనా కారణంగా ఉపసంహరించుకుంటే, మొత్తం రూ.14 లక్షలకు పైగా తగ్గుతుందన్న మాట..