జీవితం అంటే ఒకొక్క మెట్టు ఎక్కే నిచ్చెన. ప్రపంచంలో 90 శాతం మంది ప్రజలు ఓటమిని ద్వేషిస్తూ పరాజయం చెందుతూనే ఉంటారు. దీనికికారణం విజయంలో ఉన్న రకరకాల భావాలను తెలుసుకోవడంలో చాలమంది ఫెయిల్ అవుతారు. బయటకు విజయం లా కనిపించే ప్రతిదీ విజయం కాదు. 


సక్సస్ లో మూడు రకాల కోణాలు ఉంటాయి. అస్పష్ట విజయం నిరర్ధక విజయం సంపూర్ణ విజయం అన్న మూడు భాగాలుగా విజయాన్ని విభజిస్తూ ఉంటారు. వాస్తవానికి చాలామంది తమ జీవితాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే ఆ విజయం అస్పష్ట విజయంగా నిరర్ధక విజయంగా మారి చాలామందికి ఉపయోగ పడకుండా పోతుంది. ఒక వ్యక్తికి 70 సంవత్సరాల వయసులో తాను కోరుకున్న రంగంలో విజయం లభించినా అది కేవలం నిరర్ధక విజయంగా గుర్తించాలి అని అంటారు విశ్లేషకులు.


మరి కొంతమందికి తాము ఎంచుకున్న రంగాలలో విజయం సాధించాము అన్న విషయం కూడ పూర్తిగా అవగాహన ఉండదు దానినే అస్పష్ట విజయం అని అంటారు. ఈరెండు విజయాలు వల్ల మనిషికి ఏమాత్రం ఆనందం కాని ఐశ్వర్యం కాని లభించవు. కేవలం సంపూర్ణ విజయంలో మాత్రమే ఒక వ్యక్తి తాను కోరుకున్న సంపదదతో పాటు కీర్తిని కూడ పొందగలుగుతాడు. చాలామంది జీవితంలో గెలిచిన వాళ్ళను చూసి తాము కూడ ఆ గెలిచిన వారిలా మనం కూడ  తయారై ఉంటే ఎంత బాగుండును అని భావిస్తారు కానీ ఓడిపోయిన వ్యక్తిలా తాము ఉండాలని ఊహకు కూడ అనుకోరు. 


వాస్తవానికి మనలో చాలామందికి ఓటమి అంటే ఏమిటో బాగా అర్ధం అయినా ఆ ఓటమిని గురించి విశ్లేషించడానికి ఎవరు ముందుకు రారు. ఏ మనిషి అయినా ఓటమి చెందినప్పుడు తాము కష్టంలో ఉన్నామని చాలామంది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇల్లా మన కష్టాలు వినే ఎదుటి వ్యక్తులు కేవలం టైమ్ పాస్ కు వారంతా మన కష్టాలను వింటున్నారు మనకు చాల ఆలస్యంగా తెలుస్తుంది. దీనితో ఓటమిలో విజయాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగ గల వ్యక్తి మాత్రమే జీవితంలో గెలిచి ధన వంతుడుగా మారి ఎంతమందికో ఆదర్శంగా నిలుస్తారు..

మరింత సమాచారం తెలుసుకోండి: