అదే జరిగితే వచ్చే సోమవారం నుండి ప్రారంభం అయ్యే ఇండియన్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీల పై కూడ ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది అంటున్నారు. నిన్న గాంధీ జయంతి ఆతరువాత వారాంతపు సెలవులు తరువాత వచ్చే సోమవారం ప్రారంభం అయ్యే స్టాక్ మార్కెట్ ఒడుదుడుకులు చూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అగ్ర దేశ అధ్యక్షుడుకి కూడ కరోనా ముప్పు తప్పలేదు అంటే కరోనా ప్రభావం ప్రపంచం పై ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది కాబట్టి దాని ప్రభావం ప్రతి విషయానికి చాల సున్నితంగా స్పందించే ఇండియన్ స్టాక్ మార్కెట్ పై కూడ ఉంటుందని అంచనాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా ఉండగా బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్ల ర్యాలీ వచ్చే వారం కూడ కొనసాగుతుంది అన్న ప్రాధమీక అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటో రంగానికి చెందిన అనేక కార్ల కంపెనీల అమ్మకాలు గడిచిన సెప్టెంబర్ లో బాగా ఉన్న పరిస్థితులలో ఆటో రంగానికి సంబంధించిన షేర్ల పై కూడ మరింత ర్యాలీ పెరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉండగా సెప్టెంబర్ నెలలో జీ ఎస్ టీ వసూళ్లు బాగా పెరగడంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కరోనా దెబ్బ నుండి నెమ్మదిగా కోలుకుంటోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు దసరా దీపావళి సీజన్ మొదలు అవుతున్న పరిస్థితులలో వాహన ఎలాట్రానిక్స్ రంగానికి చెందిన వివిధ కంపెనీలు తమ సేల్స్ ఈ పండుగ సీజన్ లో బాగా పెరుగుతాయి అన్న అంచనాలలో ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి