జాతీయ స్థాయిలో పాడి పరిశ్రమ లను అలాగే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త వినూత్నమైన ఆలోచన చేస్తోంది. ఇక అందులో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రాల వారీగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పాడి పరిశ్రమలో అలాగే వ్యవసాయం లో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారో, అలాంటి వారికి ఇప్పుడు సరికొత్తగా ఒక అరుదైన అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పాడి, పరిశ్రమ లను ఏర్పాటు చేసిన వ్యక్తుల మధ్య పోటీని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైతే పాడి పరిశ్రమలో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారో, అలాంటి వారందర్నీ దృష్టిలో పెట్టుకుని, గోరత్న పురస్కారం యోజన పథకం కింద సరికొత్త పోటీని నిర్వహిస్తోంది.

ఇందులో పాల వ్యాపారం, పాల పొడి వ్యాపారం , పాల ఉత్పత్తి కేంద్రం, దేశీయ ఆవులు పెంపకం, కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్స్ లో పని చేస్తున్న వారు ఈ పోటీకి అనర్హులు. ఇక ఇందులో మూడు విభాగాలుగా విభజించి, రాష్ట్రీయ అలాగే జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతి కింద 5 లక్షల రూపాయలను, రెండో బహుమతి కింద మూడు లక్షల రూపాయలను, అలాగే మూడవ బహుమతి లక్ష రూపాయలను అవార్డు కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇందులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద గోపాల రత్న అవార్డును జాతీయ స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది.

ఇప్పటికే ఈ పోటీకి సంబంధించిన దరఖాస్తులు కూడా మొదలయ్యాయి.www.dahd.nic.in వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది కేంద్రం. అంతేకాదు మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు పేరును నమోదు చేయించుకోవచ్చు. 011-23383479 అనే  టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి కూడా, ఈ పోటీకి మీ పేరును నమోదు చేయించుకునే అవకాశం కల్పించబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: