తాజాగా కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి వయో వందన యోజన పథకాన్ని తీసుకు రావడం గమనార్హం. ఇక ఇందులో సామాజిక భద్రత పథకం గా గుర్తింపు పొందింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎటువంటి నష్టం రాకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బులు పొందవచ్చు.. కాకపోతే కొనుగోలు ధర లేదా సబ్స్క్రిప్షన్ మొత్తంపై హామీ ఇవ్వబడిన రిటర్న్స్ ఆధారంగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వబడుతుంది.. 2020 నుండి ఈ పథకాన్ని పొడిగిస్తూ 2023 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రభుత్వం గ్యారెంటీ ఆధారంగా ఇప్పటికే సబ్స్క్రిప్షన్ అయినా సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకం వర్తిస్తుందని సమాచారం..


ఈ పథకం కింద పెట్టుబడి పెట్టాలంటే గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల నెలవారి పదివేల ను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ పథకం పది సంవత్సరాలపాటు కొనసాగుతుంది.. కాబట్టి 8 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. ఇందులో నెలవారి, మూడు నెలలకి.. ఆరు నెలలకి అలాగే సంవత్సరానికి ఫ్రీక్వెన్సీ ప్రకారం పది సంవత్సరాల వ్యవధిలో మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పథకం కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు పెన్షన్ కోసం కనీస పెట్టుబడి మీరు 1,56,658 రూపాయలను పెట్టుబడి పెట్టాల్సి వుంటుంది.. ఒకవేళ నెలకు వెయ్యి రూపాయలు  గనుక మీరు కనీస పెన్షన్ పొందాలి అంటే రూ.1,62,162 గా ప్రస్తుతం  సవరించబడింది.


అయితే  పథకంలో చేరడానికి కనీస వయస్సు 60 సంవత్సరాల వయసు ఉండాలి. కాల వ్యవధి పది సంవత్సరాలు కాబట్టి ఇందులో చేరడం వల్ల మనం సంవత్సరానికి పెన్షన్ కింద ఏకంగా ఒకేసారి రూ. 1,11,000 రూపాయలను పొందవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: