ఇకపోతే ఎవరైనా డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు దానిని దాచుకోవాలని ఆలోచిస్తారు. అలా దాచుకోవాలంటే ముందుగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీ డబ్బుకు తగిన లాభం వస్తుంది. అయితే రిస్క్ లేకుండా డబ్బు దాచి పెట్టాలి అంటే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న కొన్ని రకాల పథకాలు అందుకు ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి ఉంది. ఇది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. దీనిలో వచ్చే రాబడికి ఎలాంటి టాక్స్ మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. పైగా రిస్క్ కూడా ఉండదు.


ఇక ఈ పథకంలో మీరు నెలకు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇందులో చేరిన కొన్ని సంవత్సరాల  లోనే మీరు మిలియనీర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఒకవేళ మీరు అవసరం అనుకుంటే సంవత్సరం తర్వాత మీ డబ్బులను మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 6.8% వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాదు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను  మినహాయింపు కూడా లభిస్తుంది. అంతేకాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు మీ అకౌంట్ కు జమ అవుతాయి.

ఒకవేళ మీరు రూ.7 లక్షలు పొందాలి అనుకుంటే ఈ పథకంలో ముందుగా మీరు రూ.5 లక్షలు  ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అంతా ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో ప్రతి నెల కొంత డబ్బును ఆదా చేసుకుంటే ఖచ్చితంగా మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మంచి ఆదాయం అయితే ఉంటుంది. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవారు డబ్బు ఆదా  చేసుకోవాలి అంటే ఇలాంటి ఉత్తమమైన పథకాలను ఎంచుకొని డబ్బులు పొదుపు చేయడం వల్ల రిస్క్ ఉండదు మంచి లాభం కూడా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: