రాజ్ తరుణ్ మే -11 - 1993 విశాఖపట్నంలో జన్మించారు. ఇక నటన మీద ఆసక్తితో ముందు లఘు చిత్రాలలో నటించాడు. ఇక వీటి ద్వారా బాగా పేరును సంపాదించుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత 2013లో విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్ గా, రాజ్ తరుణ్ సరసన నటించి అందరిని మెప్పించింది.రాజ్ తరుణ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈయన సినిమా ఏదైనా విడుదలవుతోంది అంటే చాలు రిలీజ్ అయ్యే రోజున తన ఫోన్ ను స్విచాఫ్ చేస్తాడట. సాయంత్రం రివ్యూ చూడడానికి మాత్రమే ఫోన్ ఆన్ చేస్తాడట. ఇక ఇద్దరి లోకం ఒకటే సినిమాకు ముందు తిరుపతి మొక్కు తీర్చుకొని, జుట్టు లేకుండా ఫేక్ జుట్టుతో సినిమాను సక్సెస్ చేశారు రాజ్ తరుణ్..