రెండురోజుల క్రితంజరిగిన ‘త్రిపుర’ ఆడియో వేడుకలో ఒకస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోల సంఖ్య10కి చేరిపోయిన నేపధ్యంలో ఇక సామాన్య హీరోలకి అవకాశాలు ఎక్కడ వస్తాయి అంటూ మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ దాసరి సంచలన వ్యాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈసంఘటన జరిగి 48 గంటలు కూడ పూర్తి కాకుండానే చిరంజీవి దాసరిలు ప్రేమగా ఒకరినొకరు పలకరించుకుంటూ చేయిచేయి కలుపుతూ మీడియా కెమెరాలకు పోజ్ ఇవ్వడం అందరి మైండ్స్ ను బ్లాంక్ చేసింది. మాజీ మంత్రి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి పెళ్లివేడుకకు అతిరధ మహారధులు హాజరైన విషయం తెలిసిందే.
రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఎందరో ఈపెళ్ళికి వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు. అయితే ఈపెళ్ళిలో ఎంతమంది అతిథులు హడావిడి చేసినా అందరి దృష్టి మాత్రం చిరంజీవి దాసరిల పైనే నిలిపారు.
చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురుపడ్డ ఈప్రముఖులు ఇద్దరు నవ్వుతూ విష్ చేసుకుని ఒకరి చేయి ఒకరు ప్రేమగా తీసుకుని తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు అన్నట్లుగా అద్భుతంగా నటించారు. దీనితో ఈపెళ్ళికి వచ్చిన వారి దృష్టి అంతా వీరి కలయిక పై నిలపడమే కాకుండా రాజకీయాలలో సినిమాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనే విధంగా వీరి ప్రవర్తన ఉంది అంటూ కామెంట్ చేసుకున్నట్లు టాక్..