టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళికి సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు మిస్ అయింది. ఈ విభాగంలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విజేతగా నిలిచాడు. ఇటీవల సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియా 2012 అవార్డుకు ఎంటర్ టైన్మెంట్ విభాగంలో దక్షిణాది నుంచి రాజమౌళి ఒక్కరే నామినేట్ అయ్యాడు. అయితే ఈ అవార్డును మాత్రం ఆయన గెలుచుకోలేకపోయాడు. హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఎంటర్ టైన్మెంట్ రంగంలో సీఎన్ఎన్-ఐబీఎన్ 2012 అవార్డు దక్కించుకున్నారు. ‘పాన్ సింగ్ టోమర్' అనే హిందీ సినిమాలో, ‘ది అమేజింగ్ స్పైడర్ మేన్', ‘లైఫ్ ఆఫ్ పై' చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌కు గాను ఇర్ఫాన్ ఖాన్ ఈ అవార్డు దక్కించుకున్నాడు. ఇక రాజకీయ రంగంలో.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సీఎన్ఎన్-ఐబీఎన్ 2012 అవార్డు దక్కించుకున్నారు. ఇక్కడ బిజేపీని అధికారంలోకి తేవడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు గాను ఆయన ఈ అవార్డు దక్కింది. బిజినెస్ రంగంలో.. ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా కు సంబంధించిన యూసఫ్ హమీద్ సీఎన్ఎన్-ఐబీఎన్ 2012 అవార్డు దక్కించుకున్నారు. పబ్లిక్ సర్వీస్ రంగంలో.. నారాయణ హృదయాల ద్వారా సేవ చేస్తున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవి శెట్టి ఈ అవార్డు అందుకున్నారు. స్పోర్ట్స్ రంగంలో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అవార్డు దక్కించుకున్నారు. అమీర్ ఖాన్ తో పాటు సత్యమేవ జయతే టీంకు స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: