తేనెకళ్ళ సుందరి శ్రుతి హాసన్ ను చూసి ఇష్టపడని వారు ఉండరు. అటువంటి శ్రుతి పై ఓ దర్శకుడు పగ బట్టి కక్ష సాధించాడట. ఈ వార్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా పేరుగాంచిన ప్రభుదేవా హీరోయిన్ శ్రుతి ని నాయిక గా చేసి తెలుగులో విజయవంతం అయిన ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ సినిమాను బాలీవుడ్ లో ‘రామయ్యా వస్తావయ్యా’ పేరుతో నిర్మిస్తున్నాడన్నా సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న శ్రుతి, ఈ మధ్య జరిగిన ఒక షెడ్యుల్ లో ఒకరోజు ఉదయం ఆ షూటింగ్ స్పాట్ కు కొన్ని గంటలు ఆలస్యం గా వచ్చిందట. దానితో శ్రుతి పై విపరీతంగా కోపగించిన ప్రభుదేవా ఆమెతో ఆరోజు మాట్లాడడమే మానివేశాడట. అంతేకాదు ఆ షూటింగ్ స్పాట్ లో ఉన్న ఏ ఒక్కరూ శ్రుతి తో మాట్లాడకుండా మౌనం వహించడంతో శ్రుతి హాసన్ ప్రత్యక్ష నరకాన్ని చూసిందట. చాలా సేపటి వరకూ జరుగుతున్న విషయాలు ఏమి అర్ధం కాక అయోమయంలో పడిపోయి౦దట ఈ గోల్డెన్ లెగ్ హీరోయిన్. కొన్ని గంటలు అయ్యాక మాత్రమే యూనిట్ సభ్యులు అంతా అలా తనతో ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలుసుకున్న శ్రుతి షాక్ గురి అయిందట. ఇక లాబం లేదు అనుకోని చేసిన పొరపాటుకు శ్రుతి ప్రభుదేవా కి సారీ చెప్పడంతో ఈ వ్యవహారం ముగిసిందట.

ప్రభుదేవా దర్శకత్వంలో నిర్మింపబడుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాతో శ్రుతి హాసన్ కు బాలీవుడ్ లో మంచి టర్నింగ్ పాయింట్ వస్తుందని అంటున్నారు. ఒక్కరోజు నరకం చూసినా శ్రుతి కి బాలీవుడ్ లో కూడా గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సినిమా స్టిల్స్, టీసర్ ను చూసినవారు అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: