తెరమీద ఎంతో గంభీరంగా కనిపించే ఎస్వీ రంగారావు నిజ జీవితంలో మాత్రం ఎంతో సున్నిత హృదయంతో ఉండేవారు. ఆయనకు ఏ మాత్రం విరామం దొరికినా బొమ్మలు వేయడం, కవితలు రాయడం, పుస్తకాలు చదవడం వంటి పనులు చేసేవారు.
కాగా, ఆయనకు మొదట్లో అడవి జంతువులను వేడాడం అలవాటుగా ఉండేది. తుపాకితో గురి పెడితే ఆయన గురి తప్పేది కాదు. అయితే ఒకసారి ఎస్వీఆర్ వేటకు వెళ్లి నప్పడు ఒక జింక పిల్ల ఆయనకు కనిపించింది. అయితే అది ఆయన్ని చూసి పారిపోవడానికి ఏ మాత్రం ప్రయత్నించకుండా ఎస్వీఆర్ వైపు చూస్తూ ఉండి పోయిందట.
నాలాంటి జంతువులను వేటాడ్డానికి నీకు మనసెలా వచ్చింది అని అడుగుతున్నట్లుగా ఆ జింక పిల్ల ఎస్వీఆర్ వైపు చూస్తూ ఉండిపోయిందట. అప్పటి నుంచి ఎస్వీఆర్ వేటను పూర్తిగా మానివేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: