మెగా మేనల్లుడ సాయి ధరమ్ తేజ్, రాశికన్న జంటగా నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే...మారుతి ద్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సత్యరాజ్ ప్రముఖ పాత్రల్లో నటించారు. అయితే సినిమా లో చూపించిన సన్నివేశాలు బాగా రావడం తో  సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. తెజు లిస్ట్ లో మరో హిట్ పడుతుందని అనుకున్నారు.. 


కాగా, డిసెంబర్ 20 న ఈ చిత్రం ప్రేక్షకలను పలకరించింది.. ముద్దుగా చూపించిన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ ఎలివెట్స్ ఈ సినిమాలో కనిపించలేదని జనాలు అంటున్నారు.. సినిమా కథ రొటీన్ గా ఉండటం సినిమాకు మిశ్రమ టాక్ ను అందిస్తుంది..చిత్రలహరి సినిమా విజయం తర్వాత తేజు చేసిన ఈ సినిమా ఇప్పుడు కొంచెంకొంచెంగా పర్వాలేదని టాక్ తో దూసుకుపోతుంది. 

 

మారుతి మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబో వచ్చిన “ప్రతిరోజూ పండగే” ఎక్కువ కామెడీ పైనే దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. దీని మూలంగా కీలకమైన ఎమోషన్స్ అంతా పక్కదారి పట్టేసాయి. అలా అని ఉన్న కామెడీ కూడా మరీ అంత పండదు.దానికి తోడు కాంపిటీషన్ ఎక్కువ ఉండడం ఓవరాల్ గా ఈ చిత్రాన్ని బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలపొచ్చు. దీనికి తోడు క‌థ‌నం అంతా ఊహించేలాగానే ఉంటుంది.


కామెడీ టైమింగ్ కూడా కొందరికి సెట్ కాలేదని జనాలు అంటున్నారు.. మొత్తానికి ఈ సినిమా తేజుకి సెట్ అయ్యేలా లేదని జనాలుఅభిప్రాయపడుతున్నారు..మొదటి షో కే మిశ్రమ టాక్ తో  సాగుతుంది. నాన్ సింక్ రొమాన్స్ జనాలను అనుకున్నంతగా ఆకట్టుకోలేదు అని క్రిటిక్స్ కూడా వెల్లడిస్తున్నాయి.. మరి తేజూ ఖాతాలో హిట్ పడిందా లేదా అన్న విషయం తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.. రూలర్ సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ కావడంతో సినిమా పై అంచనాలు తగ్గాయని జనాలు అభిప్రాపడుతున్నారు.. మరి కలెక్షన్స్ ఈ మాత్రం వచ్చాయో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: