సుడిగాలి సుధీర్, ఈ పేరు గురించి ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు అనే చెప్పాలి. కెరీర్ పరంగా మెజీషియన్ అయిన సుధీర్, మొదట్లో తన స్నేహితుడి సాయంతో హైదరాబాద్ చేరుకొని, ఆ తరువాత ఈటీవీలో జబర్దస్త్ లో మొదట మేనేజ్మెంట్ విభాగంలో పని చేసాడు. ఆ తరువాత తన యాక్టింగ్ టాలెంట్ తో అప్పట్లో మెల్లగా ఆ షోలోకి ప్రవేశించాడు. ఇక అక్కడినుండి మెల్లగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎట్టకేలకు తన పేరుతో సుడిగాలి సుధీర్ అనే టీమ్ ని ఏర్పాటు చేసే స్థాయికి వచ్చాడు. 

 

ఇక అక్కడినుండి అతడికి మంచి పేరు రావడం జరిగింది. సుధీర్ తో పాటు మరికొందరు జబర్దస్త్ నటులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లోని కొన్ని సినిమాల్లో అక్కడడక్కడ కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా కూడా నటించిన సుధీర్, తొలిసారిగా హీరోగా నటించడం తనకు మంచి ఆనందాన్ని ఇచ్చిందని, అయితే తనకు కెరీర్ పరంగా వెండితెర, బుల్లితెరల్లో ఏది ఇంపార్టెంట్ అని అడిగితే, తనకు రూట్ గా ఉపయోగపడ్డది ఏదైతే దానికె తన ప్రాధాన్యత అని, ఆ తరువాతనే గ్రోత్ కి అవకాశం ఇస్తాను అంటున్నాడు. ఒకవేళ కెరీర్ పరంగా తనకు సినిమాల్లో, అలానే టీవీల్లో రెండిట్లో సమానంగామంచి అవకాశాలు లభించినట్లైతే, అప్పుడు తన ప్రాధాన్యత మాత్రం సినిమాలకే అని సుధీర్ అంటున్నాడు. 

 

ఇక ప్రస్తుతం గెటప్ శ్రీను, ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్ తో కలిసి త్రి మంకీస్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సుధీర్, అతి త్వరలో యాంకర్ ప్రదీప్ తో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు కొద్దిరోజలుగా పలు టాలీవుడ్ వర్గాలలో వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని పై స్పందించారు. తనకు ప్రదీప్ తో స్నేహితుడిగా మంచి అనుబంధం ఉందని, అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా తాను, ప్రదీప్ తో కలిసి ఎటువంటి సినిమా చేయడం లేదని, ఒకవేళ భవిష్యత్తులో మాత్రం అటువంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నటిస్తానని సుధీర్ అంటున్నాడు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: