ఆ ఇద్దరి హిట్ కాంబినేషన్... కానీ ప్రస్తుతం ఆ ఇద్దరూ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు... ఇక ఇప్పుడు హిట్ కొట్టడానికి మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. కాగా  ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని కోసం ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు ఆ ఇద్దరు. ఇంతకీ నేనెవరో గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. దర్శకుడు బోయపాటి హీరో బాలకృష్ణ.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు బంపర్ విక్టరీ  సాధించాయి. ఇక ఆ తర్వాత బోయపాటి వరుస ఫ్లాపులు ఎదుర్కొంటే...  హీరో బాలకృష్ణ కూడా వరుస ఫ్లాప్ లను చవిచూశాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఇద్దరు మరోసారి సినిమా చేస్తున్నారు. 

 

 ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే స్క్రిప్టు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని బోయపాటి చివరికి ఫైనల్ స్క్రిప్ట్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి అగోర పాత్ర అయితే మరొకటి స్టైలిష్ అని సమాచారం. కాగా ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ సినిమా. ఇక తాజాగా దీనికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అఘోర పాత్రకు కనెక్టింగ్ గా  ఉండేందుకు బోయపాటి స్క్రిప్టులో  నవగ్రహాల కాన్సెప్ట్లను కూడా పెట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో స్క్రిప్ట్ ఏదైనా సెంటిమెంట్లు మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు అంటున్నారు ప్రేక్షకులు. 

 

 ఎందుకంటే బాలకృష్ణ గ్రహాల సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆయన పూజలు దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ముందు సినిమాల్లో కూడా అక్కడ అక్కడ గ్రహాల సెంటిమెంట్ కు సంబంధించిన సీన్లు కూడా ఉంటాయి.ఈ క్రమంలోనే తాజా సినిమాలో కూడా గ్రహాలు సెంటిమెంట్ ను టచ్ చేస్తూ దర్శకుడు బోయపాటి స్క్రిప్టును రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అటు ప్రేక్షకులు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమాలో బలమైన  కంటెంటే  విజయానికి కారణం అవుతుందని.. అంటున్నారు. మరి హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇద్దరికీ ఇస్తుందా  లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: