టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ హీరోలు ఇంకెంతో మంది జూనియర్ హీరోలు. ఎవరికివారు సత్తా చాటుతూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అటు ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరో లకి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఇస్తూ స్టార్ డమ్  కట్టబెడుతున్నారు. ఇలా ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా  రాణిస్తున్న వారు ఎంతోమంది. అయితే వారసుడిగా వచ్చిన వాళ్ళు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా.. తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో  సరిలేరు మీకెవ్వరు అని నిరూపించుకున్న ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. 

 

 

 ఒకరేమో టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి సరిలేరు నీకెవ్వరు అని నిరూపించుకుంటే  మరొకరేమో.. టాలీవుడ్ టాప్ నిర్మాతగా మారి పోయి ఎన్నో సినిమాలు నిర్మిస్తూ సరిలేరు నీకెవ్వరు అని నిరూపించుకున్నారు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.. తెలుగు చిత్ర పరిశ్రమలో  అద్భుతంగా రాణించిన ఆ అన్నదమ్ములు ఎవరు. వారే నిర్మాత నటుడు దగ్గుబాటి రామానాయుడు వారసులు దగ్గుపాటి సురేష్, విక్టరీ వెంకటేష్ లు. విక్టరీ వెంకటేష్ ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ... ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే వుంటారు... విక్టరీ వెంకటేష్ అన్న సురేష్ బాబు.. తండ్రి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా ప్రస్తుతం తెలుగులో టాప్ నిర్మాతగా  కొనసాగుతున్నారు. 

 

 

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచే  కాదు ఇప్పటికి కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు సరిలేరు మీకెవ్వరు అని నిరూపించారు. ఒకరు నిర్మాతగా టాప్ ప్లేస్ లో ఉంటే ఇంకొకరు హీరోగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఓవైపు అన్న మరోవైపు తమ్ముడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ లో ఉన్నది వీరిద్దరినేమో. ఇక ఇప్పుడు తాజాగా యువ జనరేషన్ కి పోటీ గా దగ్గుబాటి వారసుడిగా రానా ఎంట్రీ ఇచ్చి.. తన అద్భుత నటనతో.. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న విషయం తెలిసిందే 

మరింత సమాచారం తెలుసుకోండి: